ఇటీవల కాలం లో కొంత మంది ఆడవారు మానవతా విలువలను మరచి పోయి వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలకు తరలేపుతున్నారు లేదా చిన్న చిన్న మనస్పర్ధల  తోనే పచ్చడి కాపురం లో చిచ్చు పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది సొంత వారిపైనే దాడులకు పాల్పడుతూ దారుణాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆడవాళ్లే కాదు అటు మగవాళ్ళు కూడా ఎక్కడ తగ్గడం లేదు. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ వివాహిత తన పుట్టింటికి వెళ్లడం వద్దనందుకు అత్తమామలతో  గొడవ పెట్టుకుంది. వీరి మధ్య తలెత్తున వివాదం కాస్త భౌతిక దాడుల వరకు వెళ్ళింది. ఆగ్రహంతో ఊగిపోయిన కోడలు మామను కింద పడేసి దాడి చేసి కత్తితో అతని మర్మాంగాలను కోసేసింది   అతను గట్టిగా అరవడంతో అక్కడికి వచ్చిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది.


 బెంగాల్ రాష్ట్రం మైనా లోని తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో శిఖ అనే మహిళ కుటుంబం ఉంటుంది.. అయితే ఇటీవలే ఆమెకు వివాహం జరిగింది. దీంతో భర్త అత్తమామలతో కలిసి ఉంటుంది. అయితే అత్తారింటికి వెళ్ళిన తర్వాత పుట్టింట్లోనే ఉండాలి అనే కోరిక ఆమెకు కలిగింది. తండ్రి మటన్ తీసుకువచ్చి ఇంటికి రమ్మని కూతురికి ఫోన్ చేశాడు. పుట్టింటికి వెళ్తానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త వద్దు అని చెప్పాడు. ఇక కోపంతో అత్తమామలతో గొడవ పెట్టుకుంది. చివరికి మామ మగ్మాంగాలు కోసేసింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: