ఇటీవల కాలం లో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ సభ్య సమాజం లో పుట్టిన ఆడపిల్ల ప్రతిక్షణం భయ పడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే మొన్నటి వరకు కేవలం పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే లైంగిక వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం పరాయి వ్యక్తులు కాదు ఏకంగా సొంత వారి నుంచే వేధింపులు ఎదురవుతున్న నేపథ్యం లో తమ బాధను ఎవరికి చెప్పు కోవాలో తెలియక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఆడపిల్లలు.


చివరికి మనస్థాపంతో  ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కామంతో కళ్ళు మూసుకు పోతున్న మానవ మృగాలు ఇటీవల రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నెలలు నిండాని పసికందుల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు. అంతటితో ఆగకుండా ఏకంగా మగవారిపై కూడా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు పై అతని స్నేహితులు అత్యాచారం చేశారు.


 ఈ క్రమంలోనే  ఈ సామూహిక అత్యాచారంలో తీవ్రంగా గాయపడిన సదరు బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడ్డాడు. కాగా ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయితే దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులను డిమాండ్ చేశారు. అయితే బాలుడు పై అత్యాచారం చేసిన వారందరూ కూడా 10 నుంచి 12 ఏళ్ల లోపు వయసు వారే అని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: