సాధారణంగా కొంతమంది వ్యక్తులు లైసెన్సుడ్ గన్ తమ వెంటపెట్టుకొని తిరుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పరాయి వ్యక్తుల చేతికి ఆ గన్ వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సైనికుడు మాత్రం ఏకంగా తన లైసెన్సు గన్ పోగొట్టుకున్నాడు. డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో అర్జెంటు కావడంతో పక్కనే ఉన్న టాయిలెట్లోకి వెళ్ళాడు సైనికుడు. దీంతో అంతలోనే బస్సు రావడంతో హడావిడిగా బస్ ఎక్కేందుకు వెళ్ళాడు.


 కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గాని ఆ సైనికునికి అర్థం కాలేదు. తన చేతిలో తుపాకీ లేదు అన్న విషయం. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇక చేతిలో తుపాకీ లేకపోవడంతో మళ్లీ వెనక్కి వెళ్లి చూశాడు. అక్కడ తుపాకీ కనిపించకపోవడంతో గత్యంతరం లేక పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సదరు సైనికుడు పోగొట్టుకున్న తుపాకీ కోసం జహీరాబాద్ పోలీసులు ప్రస్తుతం వెతుకులాట ప్రారంభించారు అని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సిగ్గాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ సికిందర్ అలీ ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే డ్యూటీ ముగించుకొని తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. అయితే జహీరాబాద్ లోని నిజాంబాద్ బస్సు కోసం ఎదురుచూశాడు.


 ఇంతలో అర్జెంట్ కావడంతో ఇక జహీరాబాద్ బస్టాండ్ లో ఉన్న టాయిలెట్ కి వెళ్ళాడు. ఇక అతను టాయిలెట్ నుండి బయటికి వచ్చే సమయానికి బస్సు రావడంతో హడావిడిగా వెళ్లి బస్సు ఎక్కాడు. ఇక నారాయణఖేడ్ వరకు వచ్చిన తర్వాత తన చేతిలో తుపాకీ లేదు అన్న విషయం గ్రహించి వెంటనే జహీరాబాద్ బస్టాండ్కు వెళ్లి వెతికాడు. అక్కడ ఎంతో మందిని అడిగినా చివరికి గన్ దొరకలేదు. వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇక సైనికుడు సికిందర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జహీరాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తూపాకి ఎవరు దొంగలించారు అన్న విషయంపై విచారణ చేపడుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gun