ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కడబడితే అక్కడ విష సర్పాలు  ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక వర్షాకాలం సమయంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విష సర్పాల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఎంతో మంది నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే కేవలం బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు విషసల్పాలు ఏకంగా జనావాసాల్లోకి రావడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలా విష సర్పం ఏదైనా ఇంట్లోకి చొరబడింది అంటే చాలు దాన్ని బయటికి పంపించేందుకు ఇంటి యజమానులు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.


 పొగ బెట్టందే పాము బయటికి రాదు అని చెబుతూ ఉంటారు కదా. కొంతమంది ఇలాంటిది కూడా ట్రై చేస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఇంట్లోకి వచ్చిన పామును బయటకి పంపించాలని ఒక వింత ప్రయత్నం చేశాడు. చివరికి ఇల్లు మొత్తం తగలబడిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కోహిర్ మండలం బడంపేట్ గ్రామానికి చెందిన గడ్డమీద మొగులయ్య దసరా పండుగ సందర్భంగా తన ఇంటిని శుభ్రం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతనికి ఇంట్లో పాము కనిపించింది.


 దీంతో ఒక్కసారిగా హాడలిపోయాడు మొగులయ్య. ఇక ఆ పామును ఎలాగైనా చంపాలి అని భావించారు. ఈ క్రమంలోనే ఒక కర్ర చేతిలో పట్టుకుని పామును బయటికి రప్పించేందుకు ప్రయత్నించాడు.  కానీ ఆ పాము మాత్రం అతనికి దొరకలేదు. దీంతో పాము బయటికి రావాలంటే పొగ పెట్టాల్సిందే అన్న ఒక సామెతను బాగా ఫాలో అయ్యాడు.  టైర్ కాలే వాసనకు పాము పారిపోతుందని భావించాడు మొగులయ్య. కారు టైర్ కాల్చి పాము ఉన్న స్థలంలో వేశాడు. పాము అయితే బయటికి పోయిందో లేదో తెలియదు. కానీ చివరికి ఆ టైరు మంటలు ఇంటికి అంటుకున్నాయ్. దీంతో చూస్తుండగానే ఇల్లు మొత్తం తగలపడిపోయి బూడిదగా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: