ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం సామాన్యులకు మాత్రమేనని అధికారులకు ప్రజాప్రతినిధులకు కావు అన్న విమర్శలు ఎప్పుడు తెరమీదకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అధికారులు ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటిది సామాన్యులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే మాత్రం ఇంటికి చలాన్ పంపిస్తూ ఉంటారు అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. కానీ ఇలాంటి భావన తప్పని ఇక్కడ ఒక బెంగుళూరు పోలీస్ అధికారి నిరూపించాడు. నిబంధనలు అతిక్రమిస్తే ఇక తోటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం అన్న విషయాన్ని ఇక్కడ ప్రూవ్ చేశాడు.


 ఇక ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా తన సహోద్యోగి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధించాడు మరో పోలీస్. సాధారణంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అయితే ఫుల్ హెల్మెట్ ధరించాలని కేవలం క్యాప్ హెల్మెట్ వాడొద్దని నిబంధన కూడా అమలులో ఉంది. వాహనదారులు ఎవరైనా హాఫ్ హెల్మెట్లను ఉపయోగిస్తే ఇక ట్రాఫిక్ జరిమానా విధిస్తారు. అయితే ఇక ఈ నిబంధనలను పాటించకుండా బెంగళూరుకు చెందిన పోలీస్ అధికారి రూల్స్ అతిక్రమించాడు.


 క్యాప్ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే అతను కూడా ఒక పోలీస్ అధికారి.. ఇక అతని వదిలేద్దాం అని అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకోలేదు. రూల్స్ కి అందరూ సమానమే అని భావించి ఇక సదురు పోలీస్ అధికారికి జరిమానా విధించడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సామాన్యులపై అధికారులపై రూల్స్ సమానం  అని నిరూపించిన పోలీస్ కానిస్టేబుల్ పై ఎంతో మంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: