సాధారణంగా మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా తండ్రీ కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఏకంగా కూతురిని తండ్రి తన రెండో అమ్మగా భావిస్తూ ఉంటాడు. ఇక కూతురు తన తండ్రిని సూపర్ హీరో అనుకుంటూ ఉంటుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అయితే కూతురు కేవలం నిమిషాల పాటు కళ్ళ ముందు లేకపోతేనే తండ్రి విలవిలలాడిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక తండ్రికి మాత్రం అంతకుమించిన బాధ ఎదురయింది. రెండు రోజుల నుంచి కూతురు కనిపించకుండా పోయింది.


 దీంతో ఆ తండ్రి గుండెల్లో గుబులు మొదలైంది. కూతురు కోసం చుట్టుపక్కల వెతికిన ఎక్కడ ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు సకాలంలో స్పందించకపోవడంతో ఇక తన కూతురిని తానే వెతుక్కుంటానని వెళ్లాడు ఆ తండ్రి. కానీ అదే సమయంలో విధి అతని విషయంలో పగబట్టినట్లుగా వ్యవహరించింది.. చివరికి రోడ్డు ప్రమాదం బారిన పడిన సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అంతర్గామ్ మండలం కేంద్రంలోని టిటిఎస్ కాలనీలో వెలుగు చూసింది. స్థానిక ఒడ్డెర కాలనీకి చెందిన 44 ఏళ్ల రాజయ్య ద్విచక్ర వాహనంపై తన కూతురి కోసం వెతుకులాట ప్రారంభించాడు.


 అంతర్గాం నుంచి రామగుండం వైపు వెళ్తుండగా ఇక వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు రాజయ్య. తల చెట్టుకు బలంగా తాకడంతో ఇక తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మరణించాడు. అయితే రాజయ్యకు  ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉంది. రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ పెద్దగా స్పందన లేకపోవడంతో చివరికి తన కూతురి ఆచూకీ కోసం ద్విచక్రవాహనంపై వెతకడం ప్రారంభించాడు. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే ఇంతటి ప్రమాదం తప్పేదని ఒక ప్రాణం నిలిచేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: