ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ప్రపంచ నలుమూలల్లో ఎలాంటి ఘటన జరిగిన కేవలం నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు జనాలు. ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు అటు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. ఇక ఇంటర్నెట్ ను షేక్ చేసే కొన్ని వార్తలు అయితే నేటిజన్స్  అందరిని కూడా షాక్ కి గురి చేస్తూ ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఒకప్పుడు కోళ్లు కోడి పుంజులు లాంటివి పెంచుకోవడం చేసేవారు ఎంతోమంది. ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు కోడిపుంజుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. ఇటీవలే ఒక కోడిపుంజు చేసిన పనికి ఏకంగా దాని యజమానిపై  పోలీస్ కేసు నమోదు కావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.


 ఇక ఈ వార్త కాస్త ప్రతి ఒక్కరిని అవాక్కయ్యలా చేస్తూ ఉంది. ఏకంగా పిల్లాడిపై కోడిపుంజు దాడి చేయడంతో దాని ఓనర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు బాధిత కుటుంబం. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం మంజూమల్లో వెలుగు చూసింది. రెండేళ్ల పిల్లాడికి కళ్ళ కింద, బుగ్గలపై, చెవి వెనక, తల వెనక కోడిపుంజు బలంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం సదరు  చిన్నారి  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇక కళ్ళ కింద కోడి పుంజు దాడి చేయడంతో అది భవిష్యత్తులో అతని కంటిచూపుపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇకపోతే ఆ బాలుడి తల్లిదండ్రులు కోడిపుంజు యజమానిపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hen