సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించరని కొన్ని కొన్ని సార్లు విమర్శలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరైన సమయానికి వచ్చే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన మిషన్లను నేటి రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నాయ్ ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఫింగర్ ప్రింట్  బయోమెట్రిక్  ద్వారా ఇక తమ రోజువారి హాజరును నమోదు చేస్తూ ఉండడం.. మరి కొంతమంది ఫేస్ రికగ్నేషన్ ద్వారా కూడా ఇక రోజువారి హాజరు విధానాన్ని పూర్తిచేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇక ఉపాధ్యాయులు సరైన సమయం లో పాఠశాలకు వచ్చే విధంగా ఇలాంటి అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం బాగానే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి టెక్నాలజీలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే మాత్రం అది ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ఏకంగా అటెండెన్స్ కోసం తెచ్చిన ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ఒక ఉపాధ్యాయుడికి ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అతను గుండు చేసుకోవడం కారణంగా ఇక పేస్ రికగ్నిషన్  యాప్ అతన్ని గుర్తించలేదు.



 ఈ ఘటన ఎక్కడో కాదు సత్యసాయి జిల్లా మేళాపురం లో వెలుగు చూసింది. టీచర్ ఆది నారాయణ గత నెల 5వ తేదీన గుండు గీయించుకున్నాడు. అయితే గుండు చేసుకోక ముందు వెంట్రుకలు కొన్ని సమయం లో ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేసుకున్నాడు. దీంతో గుండు చేయించుకున్న తర్వాత ఫోటో ఒకేలా లేకపోవడం తో యాప్ రిజక్ట్ చేసింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ నుంచి అతడు మెమో అందుకున్నాడు. అయితే మీడియాకు లిక్ చేయలేదని వివరణ ఇచ్చిన అతన్ని ఇటీవల సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: