దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు ఎంతలా పెరిగిపోతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఎక్కడా కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తున్న కూడా ఎవరిలో భయం కనిపించడం లేదు అని చెప్పాలి. ఒకప్పుడు కేవలం ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై మాత్రమే అత్యాచారాలకు పాల్పడేవారు కామాంధులు. కానీ ఇటీవల కాలంలో పక్కన కుటుంబ సభ్యులు ఉన్న కూడా వారిపై దాడి చేసి మరి దారుణంగా అత్యాచారాలకు పాల్పడటం అంతటితో ఆగకుండా హత్యలు చేస్తూ ఉండడం లాంటి ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 కామంతో ఊగిపోతూ కనీస మానవత్వాన్ని మరిచిపోయి మానవ మృగంలా మారిపోతున్న ఎంతోమంది మగాళ్లు ఏకంగా అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న తీరు ఇక తల్లిదండ్రులు అందరి వెన్నులో భయం పుట్టిస్తుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలా అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న వారికి కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. చిన్నారిపై రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి విధించిన అతి చిన్న శిక్ష ప్రస్తుతం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నవడాకు చెందిన అరుణ్ పండిట్ కొన్నేళ్ల క్రితం ఒక చిన్నారిని రేప్ చేశాడు. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని ఇక పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఊర్లోనే పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలోనే చిన్నారిపై అత్యాచారం చేసినందుకుగాను నిందితుడికి ఐదు గుంజీలు తీయాలి అంటూ శిక్ష వేసి సరిపెట్టారు.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడిని పోలీసులకు అప్పగించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: