ఇటీవల కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఈ సభ్య సమాజంలో బ్రతుకుతుంది మానవత్వం ఉన్న మనుషులా లేకపోతే కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో మనుషులు బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా పరాయి మహిళలపైనే కాదు సొంత వారి పైన కూడా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి.


 ఒకప్పుడు కేవలం ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై మాత్రమే అత్యాచారాలకు పాల్పడేవారు. ఈ క్రమంలోనే ఆడపిల్ల బయటికి వెళుతుందంటే చాలు వారికి తోడుగా మరొకరిని పంపించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇక పక్కన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా కామాంధులు ఎక్కడా లెక్కచేయడం లేదు. ఏకంగా కుటుంబ సభ్యులపై దాడి చేసి మరి ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు ఇక మహిళల రక్షణను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పదహారేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న బాలికపై తూర్పాటి కొమరయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు.  అతనిపై చేగుంట పోలీసులు ఫోక్సో చట్టం మీద కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి కొమరయ్యకు అన్నం పెట్టమని బాలికకు చెప్పి ఇక పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్ళాడు. అదే అదునుగా భావించిన కొమరయ్య చివరికి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సదరు వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: