మనిషి జీవితం కేవలం దేవుడు చేతిలో కీలుబొమ్మ లాంటిది అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇక పెద్దలు ఏదో చెబుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే కాలం గడపలేం అని నేటి రోజుల్లో జనాలు అంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం నిజంగా పెద్దలు చెప్పింది నిజమే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ప్రమాదాలు ఏకంగా ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. కుటుంబమంతా సంతోషంగా ఉన్న సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబాన్ని అరణ్యరోదనలో మునిగిపోయేలా చేస్తూ ఉంటుంది విధి.


 ఎందుకంటే సాధారణంగా ముసలి వాళ్లు అయిన తర్వాత అనారోగ్యంతో మరణించడం జరుగుతూ ఉంటుంది. కానీ అభం శుభం తెలియని చిన్నారులు సైతం కొన్ని కొన్ని సార్లు ఊహించని ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సరదాగా ఆడుకుంటూ తెలిసి తెలియక చేసిన పనులే చివరికి చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఫ్యాన్ కు కట్టి ఉన్న ఒక క్లాత్ ముక్కతో ఆడుకుంటున్నాడు 13 ఏళ్ల బాలుడు. కానీ చివరికి అదే అతనికి ఉరితాడుగా మారుతుందని మాత్రం ఊహించలేదు.


 ఇక అనుకోకుండా ఆ గుడ్డ ముక్క బాలుడి గొంతుకు బిగుసుకుపోయి అతను ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో వెలుగు చూసింది. కోషేర్ నర్గీస్ అనే దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో కుమారుడు 13 ఏళ్ల నజీర్ ఫ్యాన్ కు వేలాడుతున్న క్లాత్ ముక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్లుగానే ఉన్నారు. అయితే అంతలోనే విధి ఆ పిల్లాడి విషయంలో కన్ను కుట్టింది. దీంతో ఇక క్లాత్ ముక్కలో అతని మెడ ఇరుక్కుపోయింది. దీంతో అది బిగుసుకుపోయి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కాసేపటికి తల్లి వచ్చి గమనించగా అప్పటికే బాలుడు విగత జీవిగా మారాడు.  దీంతో తల్లి బోరున విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: