నేటి రోజుల్లో మనుషులు ఆస్తులకు అంతస్తులకు ఇస్తున్న విలువ ఇక సాటి మనుషులకు మాత్రం అస్సలు ఇవ్వడం లేదు అని చెప్పాలి. ఏకంగా ఆస్తుల కోసం రక్తం పంచుకొని పుట్టిన వారిని కన్నవారిని కూడా దారుణంగా హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు బదులు మనస్పర్ధలు గొడవలే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో కష్ట కాలంలో తోడుండాల్సిన కట్టుకున్న వారు చివరికి దారుణంగా కడతేరుస్తున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి దారుణమైన హత్యలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కొన్ని సార్లు హత్యలకు గల కారణాలు తెలిసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవల కాలంలో ఎన్నో ఫైనాన్స్ సంస్థలు లోన్ అందిస్తున్నాయి. అయితే లోన్ అందించే సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక లోన్ తీసుకునే వారిపై ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అందిస్తూ ఉన్నాయి. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే ఇక ఆ ఇన్సూరెన్స్ ద్వారా తమ లోన్ మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


 ఇక ఈ సదుపాయాన్ని ఇక్కడ ఒక భర్త తనకు ఆయుధంగా మార్చుకున్నాడు అని చెప్పాలి. తీసుకున్న లోన్ తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఏకంగా భార్యను దారుణంగా హత్య చేశాడు అని చెప్పాలి. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. మూలాయం యాదవ్ లక్ష్మీదేవి లకు 8 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. అయితే భర్త డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో లక్ష్మి తన పేరు మీద ఉన్న ఇల్లును తనఖా పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని భర్తకు ఇచ్చింది. అయితే లోన్ రీపేమెంట్ విషయంలో మాత్రం తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే  భర్త ములాయం ఒక నీచమైన ఆలోచన చేశాడు. భార్యను చంపితే లోన్ కట్టాల్సిన అవసరం ఉండదు అని భావించి దారుణంగా కొట్టి చంపాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: