సాధారణంగా తల్లి నవ మాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చినప్పటికీ ఇక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన పిల్లలను కంటికి రెప్పలా కాచుకునేది మాత్రం తండ్రి అని చెప్పాలి. పైకి గంభీరంగా కనిపించిన లోలోపుల మాత్రం పిల్లలపై వెలకట్టలేని ప్రేమను దాచుకుని ఇక పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు తండ్రి. పిల్లల కోసం జీవితాంతం కష్టపడి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 తాను పడిన కష్టాలను పిల్లలు కూడా పడకూడదు అని తండ్రి పడే కష్టం మాటలు వర్ణించడం కష్టమే. అలాంటి తండ్రి ఇక తన పిల్లలకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు ఏం చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటాడు. కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు. కానీ అలాంటి తండ్రి ఇక్కడ మాత్రం సొంత పిల్లల విషయంలోనే యమకింకరుడుగా మారిపోయాడు అని చెప్పాలి. కంటికి రెప్పలా కాచుకుంటూ ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన కన్న తండ్రి చివరికి రెండేళ్ల పసిబిడ్డను దారుణంగా చంపేశాడు. ఇక ఇలా రెండేళ్ల చిన్నారిని చంపిన తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.


 ఈ విషాదకరమైన ఘటన కర్ణాటకలోని కిందట్టి గ్రామ సమీపంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సదరు వ్యక్తి గత కొంతకాలం నుంచి బిట్ కాయిన్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. కానీ ఈ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి గత ఆరు నెలలుగా కనీసం ఉద్యోగం లేక  ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కనీసం పూట గడవడం కూడా అతనికి ఇబ్బందిగా మారిపోయింది. కనీసం తన బిడ్డకు ఆహారం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపం చెంది చివరికి కూతురుని చంపి అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి అతని కాపాడారు. ఇక పోలీసుల విచారణలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: