పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకం. జీవితాంతం మనతోపాటు కష్టసుఖాల్లో కలిసి ఉండే భాగస్వామిని ఎంచుకునే ఒక మంచి అవకాశం.. అందుకే పెళ్లి విషయంలో ఎవరు తొందరపడకుండా ఇక నచ్చిన వారిని తమ అభిప్రాయాలను అర్థం చేసుకునే వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.  అర్థం చేసుకునే వారు దొరికితే అంతకంటే ఇంకేం కావాలి అని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రేమ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.


 మరి కొంతమంది ఇక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్న సంతోషంగానే ఉంటున్నారు. ఇక్కడ ఓ యువకుడు కూడా పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్దలు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి మొదటి రాత్రి రోజే ఊహించని షాక్ తగిలింది. భార్య చెప్పిన నిజంతో ఆశ్చర్యపోయిన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఈటాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 జైతార గ్రామానికి చెందిన యువకుడు ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తనకు ఒక అందమైన భార్య దొరికిందని ఎంతో సంతోష పడిపోయాడు ఆ యువకుడు. ఈ క్రమంలోనే మొదటి రాత్రి కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసాడు. చివరికి మొదటి రాత్రి రానే వచ్చింది. కానీ నవవధువు మాత్రం శారీరక సంబంధానికి నిరాకరించింది. వివాహ కార్యక్రమాల వల్ల అలసిపోయి ఉంటుందని అనుకున్నాడు. కానీ రెండో రోజు కూడా ఆమె భర్తను దగ్గరికి రానీయలేదు. ఏం జరిగిందని ప్రశ్నిస్తే ఒక షాకింగ్ నిజం చెప్పింది. తను అమ్మాయిని కాదు ట్రాన్స్ జెండర్ అని.. ఆ విషయం దాచి తన తల్లిదండ్రులకు పెళ్లి చేశారని చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు. దీంతో తనకు న్యాయం చేయాలి అంటూ పోలీసులను ఆశ్రయించాడు వరుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: