సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రకాల బంధాలు ఉన్నప్పటికీ అటు ఏడు అడుగుల ద్వారా ఒకటైన దాంపత్య బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే జీవితంలో ఉన్న అన్ని బంధాలు వదిలేసిన అటు దాంపత్య బంధం మాత్రం చివరి వరకు తోడునీడగా ఉంటుందని అంటూ ఉంటారు పెద్దలు. అంతేకాదు కష్టసుఖాల్లో పాలుపంచుకొని భర్తలో సగభాగం భార్య అన్నట్లుగా దంపతులు మెలుగుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు మాత్రమే ఒకప్పుడు ఇలా జరిగేవేమో. కానీ నేటి రోజుల్లో మాత్రం దాంపత్య బంధం అంటే గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.


 ఎందుకంటే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండి ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే గొడవలు పడుతూ చివరికి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు అక్రమ సంబంధాల పేరుతో ఒకరిని ఒకరు దారుణంగా హత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా సభ సమాజాన్ని ఉలిక్కిపడేలా  చేస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది చెడు అలవాట్లకు బానిసలుగా మారి.. చివరికి భార్య భర్తల బంధాన్ని మరింత దుర్భరంగా మార్చుకుంటున్నారు.


ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో రవి అనే 40 ఏళ్ల వ్యక్తి అదృశ్యం అయ్యాడు. రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు రవి. దీంతో ప్రతిరోజు మద్యం తాగడం ఏంటి అంటూ భార్య భాగ్యమ్మ ప్రశ్నించింది. ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లిన రవి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అయితే గ్రామ శివారులో ఉన్న హల్తి వాగు గట్టున రవి చెప్పులు ఫోన్ పాన్ కార్డు లభించాయి. ఇక హల్దీ వాగులో ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు అని చెప్పాలి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: