భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎంతటి ఉద్రిక్త వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా శత్రు దేశాలుగా పిలుచుకునే ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది అన్న విధంగానే వైరం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ పరిస్థితులు హాట్ హాట్ గానే మారిపోతూ ఉంటాయి. ఇక ఎప్పుడు ఎటువైపు నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తారో అన్న విషయం కూడా తెలియని విధంగానే ఉంటుంది. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు పాకిస్తాన్ ఆర్మీ సైతం భారత ఆర్మీ పై కాల్పులు జరపడం ద్వారా పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చడం చేస్తూ ఉంటారు.


 అదే సమయంలో అటు భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ ఆర్మీ ని తిప్పి కొట్టడమే కాదు.. ఇక భారత్ లోకి అక్రమంగా చొరబడి మారణ హోమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే పొరపాటున భారత జవాన్ ఎవరైనా పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లారు అంటే చాలు ఇక వారిని చిత్రహింసలకు గురి చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పటివరకు ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఉద్రిక్తంగా ఉండే భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో ఇటీవల ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది.


 భారత సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగం లో అడుగుపెట్టిన బిఎస్ఎఫ్ జవాన్ ను ఇక పాకిస్తాన్ అధికారులు తిరిగి మన దేశానికి అప్పగించారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పంజాబ్ సెక్టార్ లోని జీరో లైన్ వద్ద విపరీతమైన పొగ మంచు ఉండటంతో ఇక దారి కనబడకపోవడంతో బిఎస్ఎఫ్ జవాన్ పాకిస్తాన్ లోని భూభాగంలోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ ఇక ఆ భారత జవాన్ ను అదుపులోకి తీసుకుంది. ఇక మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పాకిస్తాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ జరగగా ఇక ఆ తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన భారత జవాన్ ను ఎంతో క్షేమంగా తిరిగి అప్పగించింది దాయాది దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి: