తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అనే నమ్మకంతోనే తల్లిదండ్రులు పిల్లలని పాఠశాలలకు పంపుతూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ పాఠశాలలకు పంపితే ఇంకొంతమంది గవర్నమెంట్ స్కూల్ లలో చదివిస్తూ ఉంటారు. ఇక ఎక్కడ చదివించినా పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అవుతారు అనే నమ్మకంతోనే తల్లిదండ్రులు ఉంటారు అని చెప్పాలి. అదే సమయంలో హాస్టల్లో ఉంచి పిల్లలను చదివించడం లాంటివి చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే ఇలా తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపిస్తున్న పిల్లలతో అటు ఎంతో మంది ఉపాధ్యాయులు, వార్డెన్లు  మాత్రం కూలీలుగా మార్చి పనులు చేయిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 విద్యార్థులతోనే టాయిలెట్లను శుభ్రం చేయించడం లాంటి ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులు ఏమో పిల్లలకు ఏ చిన్న పని కూడా చెప్పకుండా చదువు మీద శ్రద్ధ ఉండాలని ఎప్పుడూ చదువుకోవాలని సూచిస్తూ ఉంటే.. ఇక స్కూళ్లలో ఉండే కొంతమంది ఉపాధ్యాయులు, హాస్టల్లో ఉండే కొంతమంది వార్డేన్లు మాత్రం ఏకంగా విద్యార్థులను కూలీలుగా భావిస్తూ అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారు. ఇక్కడ ఒక వార్డెన్ ఇలాగే ప్రవర్తించి చివరికి విద్యార్థి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు అని చెప్పాలి.


 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఉన్న సెయింట్ ఆంటోనీ స్కూల్లో ఒక బావిలో చెత్త క్లీన్ చేయమని విద్యార్థులకు చెప్పాడు వార్డెన్. అయితే బావిలోకి దిగేందుకు కాస్త భయంగా ఉన్నప్పటికీ వార్డెన్ ఏమంటాడో అని భయపడి చివరికి నలుగురు విద్యార్థులు బావిలోకి దిగారు. ఇక ఆ బావి లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడంతో అందులోకి దిగిన నలుగురిలో శ్రీకర్ అనే విద్యార్థి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వార్డెన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: