సాధారణంగా అబ్బాయిలకు పెళ్లి కాకపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. బాగా చదువుకోకపోవడం కారణంగా కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదరవు.  ఇంకొంతమంది సరైన ఉద్యోగం చేయడం లేదని పెళ్ళి కాకుండానే ఉండిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఇక చదువుకోకుండా వ్యవసాయం మీద ఆధారపడ్డాడు అన్న కారణంతో ఇక వారికి పిల్లను ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇంకొంతమంది బట్టతల ఉన్న కారణంగా కూడా పెళ్లి కాక.. ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక మరి కొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా కూడా పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు. ఇలా అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కుదరకపోవడానికి ఎవరు పిల్లను ఇవ్వకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి అని చెప్పాలి.  కానీ ఇక్కడ మాత్రం అబ్బాయిలకు పెళ్లి కాకపోవడానికి ఒక విచిత్రమైన కారణం ఉంది అన్న విషయం ప్రస్తుత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా ఏకంగా ఈగల కారణంగా అబ్బాయిలకు పెళ్లిళ్లు కావట్లేదు. అదేంటి ఈగల కారణంగా పెళ్లిళ్లు కాకపోవడమేంటి ఇదేదో విచిత్రంగా ఉంది. పెళ్లిళ్లకు ఈగలకు అసలు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీ లోని బదైయాన్ పూర్వ, కుయాన్ పట్టి, దహి, సేలంపూర్ గ్రామాల పురుషులకు పెళ్లిళ్లు కాక పోవడానికి ఈగలే కారణమట. 2014లో ఈ ప్రాంతంలో కమర్షియల్ ఫౌల్టీ ఫారం ప్రారంభించడం తో ఆ గ్రామాల్లో ఈగల సంఖ్య గణనీయం గా పెరిగి పోయింది. దీంతో రోగాలు ఎక్కువవుతున్నాయట. తద్వారా ఇక ఈ గ్రామాల్లో ఉండే పురుషులకు పిల్లను ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదట. ఇక అప్పటికే పెళ్లి చేసుకున్న మహిళలు కూడా వేరే దగ్గర కాపురం పెడదామని.. లేదంటే విడాకులు తీసుకుందాం అంటూ కండిషన్లు పెడుతున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: