ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనుషులకి కుక్కలకి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది అని చెబుతున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఇష్టంగా కుక్కలను తెచ్చుకొని పెంచుకుంటున్నారు అన్నది కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా మనుషులకి మధ్య బంధం బలంగా మారడం ఏమో కానీ ఈ రోజురోజుకు శత్రుత్వం మాత్రం పెరిగిపోతుందేమో అని అనిపిస్తూ ఉంది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే. ఎందుకంటే నేటి రోజుల్లో పెంపుడు కుక్కలను ప్రేమగా చూసుకోవాల్సిన వారే దారుణంగా చంపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇదంతా పక్కన పెడితే ఇటీవల కాలంలో వీధి కుక్కలు మాత్రం ఏకంగా మనుషులతో పుట్టుకతో వైరం కలిగి ఉన్నాయేమో  అన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. రోడ్డు పక్కన ఎవరైనా మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారంటే చాలు వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తూ  ఇక దారుణంగా దాడి చేస్తూ గాయపరుస్తున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్. దీంతో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు కనిపించాయి అంటే చాలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని అటువైపుగా నడవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు చూసింది.


 ఒక వీధి కుక్క సృష్టించిన వీరంగానికి ఆసుపత్రికి క్యూ కట్టారు జనాలు. దీంతో ఆసుపత్రి మొత్తం కిక్కిరిసిపోయింది అని చెప్పాలి. అదేంటి వీధి కుక్క కరిచిందంటే ఏదో ఒకరిపై దాడి చేస్తుంది. అంతలా ఆసుపత్రికి కిరిసిపోయేంతలా ఎంతమందిని కరిచింది అనుకుంటున్నారు కదా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు గంటల వ్యవధిలోనే 40 మంది పై దాడి చేసింది వీధి కుక్క. ఇక వీధికి ఒక వీరంగానికి ఎమర్జెన్సీ వార్డు మొత్తం నిండిపోయింది అని చెప్పాలి. బర్మర జిల్లాలోని కళ్యాణ్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు గంటల్లోనే వీరంగం సృష్టించిన కుక్క 40 మందిపై దాయలు చేసి గాయపరిచింది. ఇక అందరూ కూడా స్థానిక ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇక ఈ ఘటనతో స్థానికులు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. అయితే ఇలా వీరంగం సృష్టించిన వీధి కుక్క కోసం వెతికే పనిలో పడ్డారు మున్సిపల్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: