ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నచిన్న కారణాలకే అక్కడితో జీవితం ముగిసిపోయింది అనే భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. దేవుడు ఇచ్చిన ప్రాణాలను మనుషులే చేజేతులారా తీసుకుంటూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేల చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా క్షణికావేషంలో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి కుటుంబంలో విషాదాన్ని నింపుతూఉన్నాయి అని చెప్పాలి. తమపైనే కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు అరణ్య రోదనను మిగులుస్తూ ఉన్నాయి.


 ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. సాధారణంగా కుటుంబంలో ఎవరైనా ప్రియమైన వారు చనిపోతే బాధ ఎంత ఉంటుంది అన్నది మాటల్లో వర్ణించడం చాలా కష్టం అని చెప్పాలి. ఇక ఇలా ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఏకంగా బరువెక్కిన గుండెతోనే అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక తర్వాత వారి గురించి ఎన్నో రోజులపాటు బాధపడటం ఇక తర్వాత మరచి పోవడం ప్రతి ఒక్కరూ చేసేదే. కానీ కొంతమంది మాత్రం ప్రియమైన వారు చనిపోయారు అన్న కారణంతో తమ జీవితం కూడా ముగిసిపోయిందని భావిస్తూ క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.


 ఇక్కడ ఒక కొడుకు ఏకంగా తల్లి మరణాన్ని తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. చిన్నకోడూరు గ్రామానికి చెందిన నిమ్మల విగ్నేష్ 21 ఏళ్ల యువకుడు  ఏడాది డిసెంబర్ 8వ తేదీన తల్లిని కోల్పోయాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక నాటి నుంచి మనస్థాపానికి గురయ్యాడు యువకుడు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఇటీవల ఏకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: