సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కోడిపందాలు జరగడం సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోడిపందాలు నిర్వహించడం చట్టబద్ధం కాదు అంటూ అటు పోలీసులు ఎంతలా మొత్తుకున్నప్పటికీ ఎంతో మంది జనాలు మాత్రం ఇక పోలీసులకు తెలియకుండా కోడిపందాలు నిర్వహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక కొంతమంది ప్రజా ప్రతినిధులు సైతం ఇక ఇలా కోడిపందాలలో పాల్గొంటూ ఉండటంతో ఇక పోలీసులు సైలెంట్ గానే ఉండిపోతూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో మాత్రం పోలీసులు ఏకంగా పోలీస్ స్టోరీ సినిమాలో సాయికుమార్ లాగానే రెచ్చిపోతూ పేకాట, కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తూ ఉంటారు.


 ఇక్కడ పోలీసులు ఇలాంటిదే చేశారు. ఏకంగా కోడిపందాలు జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా దాడులకు నిర్వహించారు. కానీ పోలీసులను చూసిన అక్కడున్న జనాలు పారిపోయారు. కానీ చివరికి పోలీసుల చేతికి మూడు కోళ్లు దొరికాయి. దీంతో సీనియర్ పోలీసుల దగ్గరికి వెళ్లి మూడు కోళ్లు దొరికాయి అరెస్టు చేసాము అంటూ చెప్పడంతో వాళ్ళు సైతం షాక్ అయ్యారు.  కర్ణాటకలోని కోప్పల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.  కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడలేనని రైస్ మిల్లులు కరటకి లో వెలుగు చూస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ పేకాట పాపారాయుళ్లు ఎక్కువగా కనిపిస్తారని స్థానికులు ఆరోపణ.


 సంక్రాంతికి కోడి పందాలు కూడా అక్కడ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అక్కడ కోడిపందాలు నిర్వహిస్తున్న బసన్న క్యాంపులో పోలీసులు దాడి చేసి మూడు కోళ్లను పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు.  ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. పోలీసులకు దాడులు చేయడానికి వస్తున్నారని విషయం తెలియగానే అక్కడున్న వారందరూ కూడా పారిపోయారు. దీంతో చివరికి పోలీసులకు కోళ్లు మాత్రమే దొరికాయి అని చెప్పాలి  అయితే ఇలా కోళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టడంపై అటు ఉన్నతాధికారులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: