అప్పుడెప్పుడో శ్రీశ్రీ చెప్పారు కవితకు కాదేది అనర్హమని.. అయితే ఇప్పుడు మనుషులు మాత్రం మోసాలకు పాల్పడేందుకు కాదేది అనర్హం అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక దారిలో మోసాలకు పాల్పడేందుకు పక్కా ప్లాన్ తో నేరాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా నేటి రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ కావడం ఇక ఉద్యోగాలు తక్కువ కావడం జరిగింది.


 దీంతో ఇటీవలే మంచి ఉద్యోగం దొరుకుతుందేమో అని ఇక నిరుద్యోగులు చేయని ప్రయత్నం అంటూ లేదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక నిరుద్యోగుల ఆశలనే తమకు ఆసరాగా మార్చుకుంటున్న ఎంతోమంది కేటుగాళ్లు చివరికి మాయమాటలతో నమ్మించి అందిన కాడికి దోచుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము అంటూ మాయమాటలు చెప్పి ఇక నిరుద్యోగులనే లక్ష్యంగా తీసుకొని కోట్లలో దండుకున్నారు ఇక్కడ  దంపతులు.


 సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు మాయమాటలు చెప్పడంతో వెనక ముందు ఆలోచించకుండా నిరుద్యోగులు కూడా గుడ్డిగా నమ్మేశారు. కానీ చివరికి మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు అని చెప్పాలి. హైదరాబాద్ కాచిగూడ లో దంపతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని ఇక మంచి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం అంటూ నమ్మించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఒక్కో మెడికల్ సెట్ కోసం 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారు. ఇంజనీరింగ్ సీటు అయితే 10 లక్షలు..  ఉద్యోగం అయితే మరో 10 లక్షలు వసూలు చేశారు. కొన్నాళ్లకి ప్లేట్ ఫిరాయించడంతో మోసపోయామాని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోసాలకు పాల్పడుతున్న శ్రీధర్, సంధ్యారెడ్డి దంపతులను పట్టుకునే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: