కుల వివక్షత,వర్ణ వివక్షత అనేవి మనం కొన్ని దశాబ్దాలుగా వింటున్న మాటలు ఇప్పటికి వీటిని అంతం చేయడానికి పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు మరియు ప్రోత్సహించేవారు ఉన్నారు.కొన్ని ప్రాంతాల్లో తరాలు మారినా తల రాతలు మారడం లేదు కనీసం మనిషిని మనిషిగా చూడటం లేదు అనడానికి ఇంకా కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి.

దక్షిణాఫ్రికా లో మహాత్మా గాంధీని శ్వేతా జాతీయులు రైలు నుండి కిందికి నెట్టేసిన ఘటన లాంటిదే ఈ మధ్య కాలంలో  మరో సంఘటన జరిగింది.గాంధీ తరహాలో ధోవతి చుట్టునున్న ఓ వృద్ధుడిని రైల్వే పోలీసు అధికారులు శతాబ్ది రైలు లోనికి అనుమతించలేదు.దాంతో ఆయన ఇటావా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన వద్ద ఏసీ భోగి రిజర్వేషన్ టిక్కెట్టు ఉన్న ..తనని రైల్వే పోలీసులు రైలు ఎక్కనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ పెద్దాయన.

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. ఒకవేళ గాంధీ ఇప్పుడు బ్రతికి ఉంటే గాంధీని కూడా రైలు ఎక్కనివ్వరు మన అధికారులు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.చూద్దాం రైల్వే అధికారులు తమ తప్పిదానికి ఏం జవాబు చెప్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: