కావాల్సిన ప‌దార్థాలు:
బ్రౌన్ రైస్- నాలుగు క‌ప్పులు
మెంతులు- ఒక టేబుల్ స్పూన్‌
మినప్పప్పు- ఒక క‌ప్పు

 

కందిప‌ప్పు- అర‌క‌ప్పు
నూనె- కొద్దిగా
అటుకులు- అర‌కప్పు

 

శెనగపప్పు- అర‌క‌ప్పు
పెసరపప్పు- అర‌క‌ప్పు
ఉప్పు- రుచికి త‌గినంత‌

 

త‌యారీ విధానం:
ముందుగా బ్రౌన్ రైస్, మినప్పప్పు, శెనగపప్పు, పెసరపప్పు, కందిపప్పులను రెండుసార్లు నీటిలో శుభ్రంగా కడిగి ఒక పాత్రలో మిశ్రమం చేసి.. తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే అటుకులను గంటపాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత అటుకులతోబాటు రాత్రంతా నానిన బ్రౌన్ రైస్, పప్పులను మిక్సీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేయాలి. 

 

తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి, దోసెపిండిలా గిన్నెలో కలుపుకుని మూతపెట్టి గది ఉష్ణోగ్రతలో 8 గంటలపాటు పెట్టాలి. దీనివల్ల కొద్దిగా పిండి పులిసి దోసె రుచిగా, మెత్తగా వస్తుంది. ఇప్పుడు కాలిన పెనం మీద ఈ పిండి వేసి సన్నని సెగపై కొద్దిగా నూనె వేసుకొని రెండువైపులా కాల్చుకుంటే స‌రిపోతుంది. అంతే వేడివేడి బ్రౌన్ రైస్ దోసె రెడీ.. దీన్ని ఏదైనా చెట్నీతో తింటే ఆహా.. ఏమి రుచి అనాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: