కావాల్సిన ప‌దార్థాలు:
ఓట్స్‌- రెండు కప్పులు
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- ఆరు

 

ఉప్పు- అరచెంచా
క్యారెట్ తురుము- అరకప్పు
క్యాప్సికం తరుగు- నాలుగు చెంచాలు

 

అల్లం వెల్లుల్లి మిశ్రమం- అరచెంచా
క్యాబేజీ, కీరా తురుము- అరక‌ప్పు చ‌ప్పున‌
బీన్స్‌ సన్నగా తరిగినది- నాలుగు స్పూన్లు
కొబ్బరి తురుము- పావుకప్పు

 

కొత్తిమీర- కొద్దిగా
సోయా సాస్‌- అర టీ స్పూన్‌
టమాటా కెచప్‌- మూడు స్పూన్లు
అజినోమోటో- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా ఓట్స్‌ను ఓసారి వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో రెండు స్పూన్ల‌ నూనె వేడిచేసి క్యాప్సికం మినహా మిగిలిన కూరగాయముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. కొంచెం వేగాక అందులో కొబ్బరి తురుము చేర్చి కాస్త వేగాక స్టౌ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమంలో ఓట్స్‌ పొడి, ఉప్పు కలిపి నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో గోల్డెన్ క‌ల‌ర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 

 

తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, తరుగు, అజినోమోటో చేర్చి వేయించాలి. ఇందులోనే సోయాసాస్‌, టమాటా కెచెప్‌ కలపాలి. ఇప్పుడు ఓట్స్‌ ఉండల్ని వేసి రెండు మూడు నిమిషాలు వేయించి తీసేయాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర తురుము కూడా వేసి ఒక సారి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే ఓట్స్‌ మంచూరియా రెడీ..!

 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: