కావాల్సిన ప‌దార్థాలు:
టమాటాలు- నాలుగు
ఉల్లిపాయలు- మూడు
పల్లీ నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు

 

మినపప్పు- రెండు టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి- నాలుగు
కరివేపాకులు- నాలుగు రెబ్బ‌లు
ఉప్పు- ఒక టీ స్పూన్ 

 

ఆవాలు- ఒక టీ స్పూన్‌
చింతపండు- పదిగ్రాములు
బెల్లం- ఒక టీస్పూన్‌

 

తయారీ విధానం: ముందుగా పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి వేగించుకోవాలి. ఉల్లిముక్కలు బంగారు రంగుకి వచ్చే వరకు వేగించిన త‌ర్వాత‌ టమోటాలు, ఉప్పు వేసి స్లో ఫ్లేమ్‌ మీద ఐదు నిమిషాలు వేగించాలి.

 

ఇప్పుడు స్ట‌వ్‌ ఆపేసి చింతపండు, బెల్లం వేయాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో నుండి బయటకు తీసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. రుబ్బేటప్పుడు నీళ్లు వేయకుండా రుబ్బాలి. ఇక చివ‌రిగా ఈ మిశ్ర‌మానికి తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే ట‌మాటా ఉల్లి‌ చ‌ట్నీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: