కావాల్సిన ప‌దార్థాలు: 
చికెన్- పావు కేజి
పసుపు- ఒక‌ టీస్పూన్
దాల్చిన చెక్క- ఒక పెద్ద ముక్క
టమాటా ప్యూరీ- రెండు క‌ప్పుడు

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
మిరియాలపొడి- అర టీ స్పూన్‌
కారం- రెండు టీస్పూన్లు
బటర్- ఆరు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ- ఒక క‌ప్పు

 

గరం మసాలా- రెండు టీస్పూన్లు
హెవీ క్రీమ్- 1 కప్పు
అల్లం- ఒక‌ టేబుల్ స్పూన్
లవంగాలు- మూడు

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని వెసి బాగా కలపండి. ముక్కలు ఫ్రై అయిపోయాక అప్పుడు ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మళ్లీ అదే పాన్ లో మరో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వెసి వేగించాలి.

 

ఆ వెంట‌నే గరం మసాలా, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా వేగాక టమాటా ప్యూరీ వేసి ఐదు నిముషాలు వేగిన తర్వాత ఒక కప్పు నీరు కలిపి మూత‌ పెట్టి ఉడికించాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి కలిపి పావు గంట  సిమ్‌లో ఉడికించండి. తర్వాత మిగిలిన బటర్ కూడా వేసి బాగా కలిపి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ బటర్ చికెన్ రెడీ..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: