కావాల్సిన ప‌దార్థాలు:
అరటిపండ్లు- నాలుగు
కోవా- ఒక‌టిన్న‌ర‌ కప్పు
నెయ్యి- ఆరు టేబుల్‌ స్పూన్లు

 

పంచదార- ఒక‌ క‌ప్పు
బాదం ప‌ప్పు- కొద్దిగా
యాలకుల పొడి- అర టీ స్పూన్‌

 

పాలు- ఒక‌టిన్న‌ర క‌ప్పు
కిస్‌మిస్‌- రెండు స్పూన్లు
జీడిపప్పు- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా అరటిపండ్లను తొక్క‌ తీసి మొత్తం మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక క‌ట్ చేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కోవా, అరటిపండు గుజ్జు వేసి వేగించాలి. కోవా కరిగి నూనెలా తేలిన తరువాత పంచదార వేసి చిన్నమంటపై ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ కలుపుతూ ఉడికించాలి. 

 

ఇప్పుడు పాలు పోసి మిశ్రమం కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇక‌ చివరగా యాలకుల పొడి, బాదంపలుకులు, జీడిపప్పు ముక్కలు, కిస్‌మిస్‌ వేసి స్ట‌వ్ అఫ్ చేస్తే స‌రిపోతోంది. అంతే ఎంతో సులువైన, ఆరోగ్య‌క‌ర‌మైన య‌మ్మీ య‌మ్మీ అర‌టిపండు హల్వా రెడీ. ఇది వేడి వేడిగా లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. కాబ‌ట్టి మీరు కూడా ఓ సారి ట్రై చేసేయండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: