బోన్ లెస్ చికెన్- అర‌ కిలో
ఉల్లి పాయ‌లు- రెండు
కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు
అల్లం తరుగు- ఒక‌ టేబుల్ స్పూన్

 

కొబ్బరి తురుము- నాలుగు స్పూన్లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
దాల్చిన చెక్క- చిన్న ముక్క
గోధుమ రవ్వ- ఒక టేబుల్ స్పూన్

 

పచ్చి మిర్చి- నాలుగు
లవంగాలు- మూడు
నూనె- స‌రిప‌డా
కొత్తిమీర‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్ శుభ్రంగా నీటితో క‌డిగి.. నీళ్లు లేకుండా ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లి ముక్క‌లు, కొబ్బ‌రి తురుము, ప‌చ్చిమిర్చి, అల్లం అరుగు, ఉప్పు, క‌డిగిపెట్టుకున్న చికెన్‌, గోధమ ర‌వ్వ ఇలా నూనె త‌ప్పా అన్నీ ప‌దార్థాలు మిక్సీలో వేసుకుని నీటి సాయంతో రుబ్బుకోవాలి. 

 

మ‌రోవైపు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి బాగా వేడి చేయాలి. అందులో చికెన్ మిశ్రమాన్ని వడల్లా చేసి కాగిన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ వడలు రెడీ. వీటిని ఏదైనా సోస్‌తో  వేడి వేడిగా తింటే ఎంతో బాగుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: