కావాల్సిన ప‌దార్థాలు:
పనస గింజలు- ఒక‌టిన్న‌ర క‌ప్పు
బియ్యప్పిండి- ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము- ఒక కప్పు

 

అల్లం తరుగు- ఒక‌ టేబుల్‌ స్పూను
పచ్చిమిర్చి- మూడు
కొత్తిమీర- కొద్దిగా
నూనె- డీ ఫ్రైకి స‌రిప‌డా

 

ఉల్లిపాయ‌- ఒక‌టి
జీలకర్ర- అర టీ స్పూన్‌
ఉప్పు- రుచికి త‌గినంత‌

 

త‌యారీ విధానం: ముందు పనస గింజల పై పొట్టు తీసి నీళ్ల‌లో క‌డిగి కుక్కర్లో ఉడికోవాలి.  త‌ర్వాత వాటిని చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు‌ మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.

 

మ‌రోవైపు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోసి కాగించాలి. ఇప్పుడు ముందుగా క‌లుపుకున్న‌ మిశ్రమాన్ని కొద్దీ కొద్దిగా తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో వేసి దోరగా రెండువైపులా వేగించుకుని ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ పనస గింజల వడలు రెడీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: