కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్- అర కేజి
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్
వెనిగర్- రెండి టేబుల్ స్పూన్లు

 

కోడిగుడ్డు- ఒక‌టి
కార్న్ ఫ్లోర్- రెండు స్పూన్లు
ఉప్పు- రుచిక స‌రిప‌డా
సోయ్ సాస్- ఒక టీ స్పూన్‌

 

ఆయిల్- త‌గినంత‌
ఉల్లిపాయ ముక్కలు- ఒక‌ కప్పులు
మిరపకాయలు- మూడు
కొత్తిమీర‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్‌ను నీళ్ల‌లో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్, గుడ్డు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, త‌గినం ఉప్పు వేసి బాగా కలిపి ఒక అర గంట‌ పాటు అలానే వదిలేయండి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి డీఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. 

 

తర్వాత మరో పాన్ పెట్టి కొద్దిగా స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, మిర‌ప‌కాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాక అందులో ఉప్పు, సోయ్ సాస్, వెనిగర్, వేయించిన చికెన్ వేసి బాగా కలపండి. చివ‌రిగా కొత్తి మీర కూడా వేసి స్టౌ ఆఫ్ చేస్తే ప‌రిపోతుంది. అంటే నోరూరించే వేడి వేడి చిల్లి చికెన్ రెడీ..!! 

మరింత సమాచారం తెలుసుకోండి: