కావాల్సిన ప‌దార్థాలు: 
బియ్యం- అర కేజి
వేగించిన జీడిపప్పు- ఒక‌ కప్పు
వేగించిన ఉల్లి తరుగు- అర కప్పు
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూను
జీడిపప్పు పేస్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు

 

షాజీర- ఒక‌ టీ స్పూన్‌
మరాఠీ మొగ్గలు- మూడు
అనాస పువ్వు - ఒక‌టి
జాపత్రి- రెండు

 

జాజికాయ- ఒర‌టి
బిర్యానీ ఆకులు- మూడు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌
పుదీనా తరుగు- ఒక‌ కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
లవంగాలు- ఐదు

 

దాల్చిన చెక్క- చిన్న‌ది ఒక‌టి
గరంమసాల- అర టీ స్పూన్‌
నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి పేస్ట్- రెండు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టీ స్పూన్లు
నిమ్మ‌ర‌సం- రెండు టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా బియ్యం బాగా క‌డిగి నీళ్ళు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. త‌ర్వాత బియ్యంలో ఉప్పు, మసాల దినుసులు, కొద్దిగా నూనె వేసి కాస్త పలుకుగా ఉడికించి నీళ్ళు వార్చేయాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగించాక, పచ్చిమిర్చి పేస్ట్‌ కూడా వేసి వేగించుకోవాలి. తర్వాత‌త జీడిపప్పు పేస్ట్‌, కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపుకోవాలి.

 

ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత గరం మసాల, జీడిపప్పులు, నిమ్మరసం కూడా వేసి కలపాలి. ఆ తరువాత ఒక ఇనుప పెనం మీద ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో ఒక పొర అన్నం, మరో పొర జీడిపప్పు మిశ్రమం వేస్తూ మొత్తం పరిచాక పైన నెయ్యి వేసి ఉల్లి తరుగు జల్లి గిన్నె మీద మూత పెట్టి, ఆవిరిపోకుండా దానిపై ఏదైనా బరువు ఉంచి ఒక గంటసేపు చిన్న మంటమీద ఉడికించాలి. 

 

ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి స‌ర్క్ చేసుకుంటే ఎంతో రుచిక‌ర‌మైన వేడి వేడి కాజు బిర్యానీ రెడీ. దీన్ని పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాబ‌ట్టి టేస్టీ టేస్టీ ఈ కాజు బిర్యానీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: