కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయించడంతో ప్రజలంతా మార్చి నెల 22 నుండి ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ దెబ్బ కీ దేశంలో అన్ని రంగాల్లో మూతపడ్డాయి. అడుగు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రజలంతా సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం శాతం  లాక్ డౌన్ సమయంలో ఊహించని స్థాయిలో ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారట. అందులోనూ పైగా ఎక్కువగా వంట వీడియో లకి బాగా వ్యూస్ వస్తున్నాయట. ఆ భాష ఈ భాష అని లేదు సోషల్ మీడియాలో వ్యూయర్స్ అంతా వంట ప్రయోగాలపై పడుతున్నారట.

 

 

దీంతో యూట్యూబ్ ఛానల్స్ లో వంట చానల్స్ పెట్టిన వాళ్లకి బాగా డబ్బులు వస్తున్నాయట. కుటుంబ సమేతంగా సభ్యులంతా ఇళ్ళల్లోనే ఉండటంతో...చాలామంది ఆడవాళ్ళు తమ కుటుంబ సభ్యులకు రుచికరమైన భోజన వంటకాలు అందించడానికి యూట్యూబ్ లో అనేకమైనవి వెతుకుతున్నారు అని ఇంటర్నెట్ లెక్కలు చెబుతున్నాయి. సినిమాలకు మరియు సీరియల్స్ ని కూడా వెనక్కి నెట్టి ప్రస్తుతం వంట వీడియోలు రాజ్యమేలుతున్నాయి అట. మొన్నటి వరకు పెళ్లిళ్లు కావటంతో...కొత్త దంపతులు కూడా ఈ వీడియో లపై పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

మామూలుగా అయితే సెలవులు దొరికిన సమయంలో సినిమా హాల్ కు, పార్కులకు గాని వెళుతూ ఎంటర్టైన్మెంట్ పొందే అవకాశం ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా అవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. దీంతో సోషల్ మీడియా వ్యూయర్స్ అంతా వంట వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: