కావాల్సిన ప‌దార్థాలు:
బాసుమతి రైస్- రెండు కప్పులు
కాలీఫ్లవర్‌ ముక్కలు- ఒక‌ కప్పు
కారం- ఒక టీ టీస్పూను
దాల్చిన చెక్క- చిన్న ముక్క

 

ఉల్లిపాయ ముక్క‌లు- ఒక‌ కప్పు
పచ్చిమిర్చి- మూడు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
జీలకర్ర- అర‌ టీస్పూను

 

నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
లవంగాలు- రెండు
బిర్యానీ ఆకు- రెండు
పుదీనా త‌రుగు- ఒక క‌ప్పు
కొత్తిమీర‌- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: ముందుగా బాసుమతి బియ్యాన్ని శుభ్రంగా క‌డ‌గాలి. ఇప్పుడు క‌డిగిన బియ్యాన్ని అరగంటపాటు నీళ్ల‌లో నానబెట్టుకుని అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, బిర్యాని ఆకు, పచ్చిమిరప కాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. 

 

ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసిన కాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు వేసుకొని సన్నని మంట మీద పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. కాలీ ఫ్లవర్‌ ముక్కలు చిదిమిపోకుండా అప్పుడుప్పుడూ జాగ్రత్తగా తిప్పుతుండాలి. 

 

ఇలా కాలీ ఫ్లవర్‌ ముక్కలు నూనెలో బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి. రెండు నిముషాల పాటు సన్నని మంట మీద మ‌గ్గించి చివ‌రిగా కొత్త‌మీద, పుదీనా త‌రుగు వేసి అటు ఇటు బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని స‌ర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే నోరూరించే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. 

 

వేడి వేడిగా దీన్ని తింటే.. ఖ‌చ్చితంగా వారెవ్వా అనాల్సిందే. ఎందుకంటే.. అంత‌ టేస్టీగా ఉంటుంది. పిల్ల‌లు కూడా ఈ గోబీ ఫ్రైడ్‌ రైస్ ఇష్టంగా తింటారు. మ‌రియు కాలీఫ్లవర్ క‌ర్రీస్ ఇష్టంలేని వారు.. ఇలా  గోబీ ఫ్రైడ్‌ రైస్ చేసుకుంటే తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి కూడా పొందొచ్చు. కాబ‌ట్టి.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: