కావాల్సిన ప‌దార్థాలు:
ఉల్లిపాయలు- మూడు
బ్రెడ్ క్రమ్స్- ఒక‌టిన్న‌ర‌ కప్పు
కార్న్ ఫ్లోర్- మూడు టేబుల్ స్పూన్లు

 

మిరియాల పొడి- అర‌ టీ స్పూన్
కోడిగుడ్లు- రెండు
పాలు- అర‌ కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అర టీ స్పూన్‌

 

మైదా- రెండు కప్పులు
బేకింగ్ పౌడర్- అర‌ టీ స్పూన్
ఉప్పు- రుచికి స‌రిప‌డా
నూనె- డీ ఫ్రైకి స‌రిప‌డా

 

త‌యారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను తీసుకుని తొక్క తీసి.. గుండ్రంగా కట్ చేసి విడి విడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ రింగులు తప్ప మిగిలిన పదార్ధాలను వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చెయ్యాలి. 

 

ఇప్పుడు పిండిలో ఉల్లిపాయ రింగులను ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో దొర్లించి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అలా అన్ని చేసి పెట్టుకున్నాక ఒక్కొక్కటిగా నూనెలో వేసి గోల్డెన్, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇప్ప‌డు వాటిని స‌ర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిగా క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ రింగ్స్ రెడీ అయినట్లే. వీటిని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. 

 

ముఖ్యంగా పిల్ల‌లు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఉల్లిపాయ విష‌యానికి వ‌స్తే..  శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్త్మా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు... రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మ‌రియు కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. అలాంటి ఉల్లిపాయ‌ల‌ను కేవ‌లం కూర‌ల‌కే కాకుండా.. పైన చెప్పిన విధంగా ఆనియన్ రింగ్స్ కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: