కావాల్సిన ప‌దార్థాలు:
రొయ్యలు- అర కిలో
ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు
మిరియాలు- ఒక టీ స్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

ట‌మాటా త‌రుగు-  ఒక క‌ప్పు
వాము- ఒక టీ స్పూన్‌
వెల్లుల్లి తరుగు- ఒక టీ స్పూన్‌
ఎండుమిర్చి- ఐదు

 

దాల్చినచెక్క- రెండు ముక్కలు
లవంగాలు- మూడు
కొబ్బరితురుము- పావుకప్పు

 

ధనియాలు- రెండు టీ స్పూన్లు
పసుపు- అర టీ స్పూన్‌
జీలకర్ర- ఒక టీ స్పూన్‌

 

తాలింపుకోసం:
ఆవాలు- ఒక టీ స్పూన్‌
బిర్యానీ ఆకు- రెండు
లవంగాలు- మూడు

 

దాల్చినచెక్క- చిన్నది ఒక‌టి
కరివేపాకు రెబ్బలు - రెండు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర- ఒక కట్ట

 

త‌యారీ విధానం: 
ముందుగా రొయ్యల్ని నీటిలో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్య‌ల‌కి ఉప్పు. ప‌సుపు పట్టించి పెట్టుకోవాలి. త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా ముక్కులు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, ధనియాలు, పసుపు, జీలకర్ర, వాము, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, కొబ్బరితురుము ఒక్క‌దాని త‌ర్వాత ఒక‌టి వేసుకుని వేయించుకోవాలి.

 

ఇప్పుడు వీటిని మిక్సీజారులో తీసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్‌పై మ‌రోపాన్ పెట్టుకుని.. నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలూ, దాల్చినచెక్కా, లవంగాలు, బిర్యానీ ఆకులు వేయించుకోవాలి. నిమిషం తరవాత కరివేపాకు రెబ్బలు వేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న మసాలా వేసి మంట తగ్గించాలి. 

 

కాసేపటికి ఇది వేగి నూనె పైకి తేలుతుంది. అప్పుడు రొయ్యల్ని వేయాలి. పావు గంట త‌ర్వాత కొత్తిమీర తరుగు వేసి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన రొయ్య మిరియాల కూర రెడీ అయిన‌ట్లే. రైస్ లేదా రోటిలోకి దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: