కావాల్సిన ప‌దార్థాలు:
గోధుమపిండి- ఒకటిన్నర కప్పు
ఉప్పు- రుచికి తగినంత
నెయ్యి- ఒక టేబుల్ స్పూన్‌

 

నూనె- ఒక టేబుల్ స్పూన్
నెయ్యి- రెండు టీ స్పూన్లు
జీలకర్రపొడి- అర టీ స్పూన్‌

 

వాము- అర టీ స్పూన్‌
అల్లం- అంగుళం ముక్క
పచ్చిమిర్చి- రెండు  ‌
పాలకూర తరుగు- రెండు కప్పులు

 

తాయ‌రీ విధానం: ముందుగా పాల‌కూర‌, అల్లం, ప‌చ్చిమిర్చి మిక్సీ జార్‌లో వేసుకుని నీరు పోసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత లోతైన, వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, వాము, జీలకర్రపొడి, ఉప్పు, నెయ్యి వేసి చేత్తో ఒకసారి కలపాలి. తర్వాత పాలకూర పేస్టు కూడా వేసి, కనీసం ప‌ది నిమిషాలపాటు గట్టిగా క‌లుపుకోవాలి. ఆ ముద్దపై తడిబట్ట కప్పి అర గంట త‌ర్వాత‌ పక్కనుంచాలి. 

 

ఇప్పుడు ఈ ముద్దని సమభాగాలుగా చేసుకుని, చపాతీల్లా వత్తి నెయ్యి, నూనె మిశ్రమాన్ని పలచగా రాసి, రోల్‌ చేసి, గుండ్రంగా చుట్టాలి. తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. అంటే ఎంతో రుచిక‌ర‌మైన పాలక్‌ పరాటా రెడీ. వీటికి చట్నీ లేదా రైతాతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కాబ‌ట్టి, ఈ నోరూరించే పాలక్‌ పరాటాను మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి. 

 

పాల‌కూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది; అంతేకాకుండా, ఇది మీ జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల, అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్ మొదలైన వాటితో పూర్తిగా నిండి ఉంటాయి. మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి ర‌క్షిస్తుంది. అయితే పాల‌కూర కూర‌ను తిన‌లేనివారు ఇలా పాలక్‌ పరాటా చేసుకుని తిన్నా మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: