కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్ - అర కేజి
గోంగూర - ఒక‌ కప్పు
జీలకర్ర - అర టీ స్పూన్‌
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

 

గరం మసాలా - పావు టీస్పూన్‌
కరివేపాకు - మూడు రెమ్మ‌లు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర‌- అర క‌ట్ట‌

 

మారినేషన్‌ కోసం:
ఉల్లిపాయ పేస్ట్‌ - అర కప్పు
కారం - ఒక‌ టీ స్పూన్‌
ధనియాల పొడి - అకర్‌‌ టీస్పూన్‌

 

నిమ్మరసం - అర టేబుల్ స్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక‌ టీస్పూన్‌
ఉప్పు - రుచికి స‌రిప‌డా

 

త‌యారీ విధానం: 
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ వేసి ఉల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మ‌రసం,  అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వేసి బాగా క‌లుపుకోవాలి. చికెన్ ముక్క‌ల‌కు మసాలదినుసులను బాగా పట్టించిన త‌ర్వాత అర గంట పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.

 

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి గోంగూర వేసి ఉడికేదాకా వేయించి తీయాలి. ఉడికిన గోంగూరకు పచ్చిమిర్చి చేర్చి మిక్సీలో పేస్ట్‌ చేసుకోవాలి. అలాగే మ‌రోవైపు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్‌ ముక్కలకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పాన్ పెట్టి.. కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. 

 

ఆ త‌ర్వాత చికెన్‌ ముక్కలు, గరం మసాలా వేసి పొడిగా తయారయ్యేవరకూ వేయించాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్ అందులో వేసి చికెన్‌ ముక్కలకి పట్టేలా క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత చికెన్ పొడిగా పొడిగా తయారయ్యేవరకూ వేయించుకోవాలి. అలా వేగించుకున్నాక‌.. చివ‌రిలో కొత్తిమీర జ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే గోంగూర చికెన్‌ ఫ్రై రెడీ అయిన‌ట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ గోంగూర చికెన్‌ ఫ్రై రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: