కావాల్సిన ప‌దార్థాలు:
చిక్కుడుకాయలు - ఒక‌ కప్పు
ఉల్లిపాయలు ముక్క‌లు - ఒక‌ కప్పు
అరటికాయముక్కలు - ఒక‌ కప్పు
వంకాయ ముక్కలు - ఒక‌ కప్పు

 

కందముక్కలు - ఒక‌ కప్పు
టమాటా ముక్క‌లు - ఒక కప్పు
సొరకాయ ముక్క‌లు - ఒక‌ కప్పు

 

గుమ్మడికాయ ముక్క‌లు - ఒక‌ కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు - రుచికి స‌రిప‌డా

 

కారం - ఒక టీ స్పూన్‌
చిలకడదుంపలు - ఒక‌ కప్పు
పసుపు - పావు టీ స్పూన్‌
నూనె - మూడు టేబుల్ స్పూన్లు

 

ధ‌నియాల పొడి - అర టీ స్పూన్‌
గరం మసాల - అర టీ స్పూన్‌
జీల‌క‌ర్ర పొడి - అర టీ స్పూన్‌
కొత్తిమీర‌- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: 
ముందుగా స్ట‌వ్‌‌ ఆన్‌ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె పోసుకుని వేడిచేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఆ తర్వాత తరిగి ఉంచుకున్న టమాటా ముక్క‌లు, అరటికాయముక్కలు, వంకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్క‌లు, కందముక్కలు, సొరకాయ ముక్క‌లు, చిలకడదుంప ముక్క‌లు మ‌రియు చిక్కుడుకాయ ముక్క‌లు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.

IHG

అన్ని కూర‌గాయ ముక్క‌లను ఐదు నిమిషాల పాటు మ‌గ్గ‌నివాలి. ఆ త‌ర్వాత ఇందులో స‌రిప‌డా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మ‌రో ఏదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కారం, పసుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గరం మసాల మ‌రియు కొంచెం నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంటే ఎంతో రుచిక‌ర‌మైన వెజిటేబుల్ క‌ర్రీ రెడీ అయిన‌ట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: