చెక్కర పొంగలి ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంచి రుచిని ఇచ్చే ఈ చక్కర పొంగలి చాలా బాగుంటుంది. మరి అలాంటి ఈ చక్కర పొంగలిని ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

IHG

 

కావాల్సిన పదార్ధాలు.. 

బియ్యం - 1 కప్పు, 

పెసర పప్పు - అరకప్పు, 

బెల్లం తరుగు - పావు కప్పు, 

పంచదార - కప్పు, 

 

IHG

 

నెయ్యి - పావుకప్పు, 

జీడిపప్పు - 10, 

కిస్మిస్ – 10, 

యాలకుల పొడి - కొంచెం, 

పచ్చకర్పూరం- చిటికెడు 

తయారీ విధానం.. 

 

IHG

 

ముందుగా బియ్యం ,పెసర పప్పు అరగంట పాటు నానబెట్టి గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. అనంతరం బెల్లంలో నీళ్లు పోసి బాగా వడకట్టాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన బియ్యం, పెసర పప్పులో పంచదార, బెల్లం నీళ్లు పోసుకుని 10 నిముషాలు ఉడికించి దగ్గరగా అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కొంచెం యాలకుల పొడి వేసి కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: