ఎగ్స్ ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు.  అలాంటి ఎగ్స్ తో మీరు ఎప్పుడైనా ఎగ్ ఫింగర్స్ ని తిన్నారా?  పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ వంటకాన్ని మీ ఇంట్లో ఎప్పుడైనా చేశారా? చెయ్యకుంటే ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి.. 

 

కావాల్సిన పదార్ధాలు..

 

కోడిగుడ్లు - ఎనిమిది, 

 

ఉప్పు - తగినంత, 

 

మిరియాల పొడి - అర టీస్పూన్‌, 

 

కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు, 

 

నూనె - సరిపడా, 

 

ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌ - పావు కప్పు, 

 

చిల్లీ ఫ్లేక్స్‌ - అర టీస్పూన్‌, 

 

బ్రెడ్‌ క్రంబ్స్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు

 

తయారీ విధానం.. 

 

ఒక పాత్రలో కోడిగుడ్లు పగలకొట్టి పక్కన పెట్టుకోవాలి. కాస్త సమయం తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. తర్వాత వెడల్పాటి పాన్‌ తీసుకుని దానికి నూనె రాసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోయాలి. ఒక వెడల్పాటి పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. మధ్యలో చిన్న స్టాండ్‌ లాంటిది పెట్టి దానిపై కోడిగుడ్ల మిశ్రమం పోసిన పాన్‌పెట్టి మూత పెట్టాలి. తర్వాత నీళ్లు పోసిన పాత్రపై కూడా మూత పెట్టాలి. దాన్ని చిన్నమంటపై అరగంట పాటు ఉడికించాలి. 

 

తరువాత నెమ్మదిగా బయటకు తీయాలి. ఊతప్పం మాదిరిగా అయిన వెంటనే దీన్ని వేరే ప్లేట్‌లోకి మార్చుకోవాలి. కత్తితో ఫింగర్స్‌ మాదిరిగా కట్‌ చేయాలి. మరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌, తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలపాలి. మరొక ప్లేట్‌లో కోడిగుడ్లు కొట్టి వేసి చిటికెడు ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న ఫింగర్స్‌ను పిండి మిశ్రమంలో అద్ది కోడిగుడ్డు సొనలో ముంచాలి. తరువాత బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దాలి. స్టవ్‌ పై ఒక పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దిన ఫింగర్స్‌ వేసి వేగించాలి. అంతే ఎగ్ ఫింగర్స్ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: