పిల్లలకు మంచి పోషకాల ఆహారం పెట్టాలి. అలాంటి అప్పుడు మంచి రుచిని అందించే పోషకాలు ఉన్నవాటిని తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అలా అన్ని రకాల పోషకాలు అందించిన అందించే స్నాక్స్ రాగి లడ్డు. ఇది ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అలాంటి రగిలడ్డును ఇంట్లోనే ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. పిల్లలకు చేసి పెట్టండి.   

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

రాగిపిండి- 1 కప్పు, 

 

బెల్లం తురుము- 1 కప్పు, 

 

పల్లీలు- 1 కప్పు, 

 

నెయ్యి- 1 కప్పు, 

 

జీడిపప్పు - 10, 

 

నువ్వులు-1 కప్పు, 

 

బాదం పప్పు- గుప్పెడు,

 

యాలకుల పొడి- పావు చెంచా, 

 

ఎండు ద్రాక్ష- 8 

 

తయారీ విధానం.. 

 

IHG's Kitchen

 

స్టౌ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి వేటికవే పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పక్కన ఒక గిన్నెలో పెట్టాలి. అవి ఆరిన తర్వాత పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ మిశ్రమానికి వేయించి పెట్టుకున్న రాగిపిండి, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఇందులోనే మరికొన్ని జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష కూడా వేసి కొద్దికొద్దిగా వేడి చేసిన తాజా నెయ్యి కలుపుకొని లడ్డుగా కట్టుకోవాలి. ఇంకా రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు. అంతే రాగి లడ్డు రెడీ. రోజు పిల్లలకు ఉదయం ఒకటి సాయింత్రం ఒకటి స్నాక్స్ ల పెడితే ఎంతో ఇష్టం తింటారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: