మనం ఎం ఆహారం తీసుకున్న మనకు పోషకాలు అందడమే ముఖ్యం. రుచి... పోషకాలు లేని ఆహారం ఎంత తీసుకున్న వృధానే. ఇంకా అందుకే ఏది తీసుకున్న పోషకాలు ఉండేలా తీసుకోవాలి. ఇంకా అలాంటి ఎన్నో పోషకాలు అందించే జ్యూస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆ జ్యూస్ ఏంటి అంటే? డ్రై ఫ్రూట్స్ జ్యూస్. 

 

IHG

 

పలు రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి చేసే జ్యూస్ ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు పోషకాల పరంగా మంచిది. ఇంకా అలాంటి డ్రై ఫ్రూట్ జ్యూస్ ను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇంట్ల పిల్లలకు సాయింత్రం సమయంలో చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తాగుతారు. మరి అలాంటి పోషకాల అందించే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ని ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్థాలు.. 

 

కిస్ మిస్ - అర కప్పు, 

 

బాదం పప్పు - అర కప్పు, 

 

జీడిపప్పు -  అర కప్పు,

 

పాలు- అర లీటరు, 

 

చక్కెర - కప్పు, 

 

తేనె - 2 చెంచాలు. 

 

తయారీ విధానం.. 

 

ముందు రోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 2 కప్పుల నీటిలో నానబెట్టాలి. ఉదయాన వాటిని మిక్సీ జ్యూస్ జార్లో వేసి బాగా తిప్పి అందులో పాలు, చక్కెర వేసి మరోమారు మిక్సీ పెట్టాలి. దీన్ని గ్లాసుల్లో పోసి చెంచా తేనె, అరచెంచా నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసుకుంటే ఆహా అనిపించే రుచి మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ పోషకాల జ్యూస్ ను చేసుకోండి.. తినేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: