కావాల్సిన ప‌దార్థాలు: 
చికెన్ - ఒక‌కిలో
ఉల్లి పాయు ముక్క‌లు - ఒక‌ కప్పు
పచ్చి మిర్చి - ఆరు

 

కొబ్బరి తురుము - అరకప్పు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
గోధుమ రవ్వ - రెండు టీ స్పూన్లు

 

అల్లం తరుగు - ఒక టీ స్పూన్‌
జీల‌క‌ర్ర - ఒక టీ స్పూన్‌
నూనె - సరిపడినంత

 

లవంగాలు - మూడు
కరివేపాకు - నాలుగు రెబ్బలు
ఉప్పు - తగినంత
కొత్తిమీర‌ త‌రుగు - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా బోన్‌లెస్ చికెన్ శుభ్రంగా కడిగి తడి లేకుండా నీరు తీసేయాలి. ఇప్పుడు పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ అంటే క‌డిగి పెట్టుకున్న చికెన్ తో సహా మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. మరీ గట్టిగా ఉంటే కాస్త నీరు చేర్చి మిక్సీ ప‌ట్టుకోవాలి.

IHG's Kitchen: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHICKEN' target='_blank' title='chicken-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chicken</a> Vada

ఇప్పుడు ఆ రుబ్బుని గిన్నెలోకి తీసుకోవాలి. అనంత‌రం స్టవ్ ఆన్ పాన్ పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడి అయ్యాక‌ అందులో చికెన్ రుబ్బుని వడల్లా అద్ది వేయాలి. వ‌డ‌లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి చికెన్ వడలు రెడీ అయినట్టే.

IHG

సాయంత్రం వేళ‌లో వీటిని తింటే అదిరిపోతుంది. ఎప్పుడు చికెన్‌తో క‌ర్రీ, ఫ్రై, బిర్యానీ లాంటి రెసిపీలే కాకుండా.. ఈ చికెన్ వడలు కూడా చేస్తే.. పిల్ల‌లు కూడా ఇష్టంగా తింటారు. కాబ‌ట్టి, మీరు కూడా చికెన్ వ‌డ‌లు త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: