ఇంట్లోనే ఉంటూ చాలా మందికి మంచి ఆహారం తయారు చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది. అయితే అవి ఎలా చేసుకోవాలి ఏంటీ అనేది అవగాహన ఉండదు. అసలు ఏ విధంగా చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. మన దగ్గర మంచి ఆలోచన ఉంటే మంచి ఆహారం పెద్దగా ఖర్చు లేకుండా తినొచ్చు. సాధారణంగా కబాబ్ కావాలి అంటే మనం ఎక్కువగా హోటల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటాం. అలా ఏమీ అవసరం లేదు అని ఇంట్లోనే మనం మంచిగా చేసుకుని, పుష్టి గా తినొచ్చు అని చెప్తున్నారు. కార్న్ కబాబ్ ని చాలా ఈజీ గా తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు.


కావాల్సినవి ఏంటీ అనేది ఒకసారి చూస్తే... మొక్క జొన్నలు - రెండు  కప్పులు, బంగాళ దుంపలు – రెండు కావాలి. జున్ను- రెండు టేబుల్‌ స్పూన్లు కావాలి. పచ్చి మిర్చి – రెండు కావాల్సి ఉంటుంది. అల్లం- కొంచెం చాలు. మీరు తినే ఘాటుని బట్టీ... నల్ల మిరియాల పొడి- అర టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా - అర టీ స్పూన్‌, తెల్ల మిరియాల పొడి – అర టీస్పూన్‌ వేయండి. జాపత్రి - చిటికెడు, ఎక్కువ వేయొద్దు...  ఉప్పు – మీరు తినేదానిని బట్టి... నూనె  కూడా అంతే.


తయారీ చూస్తే... ముందుగా బంగాళ దుంపలు ఉడికించి, వాటిని మిక్సీలో వేసినా లేదా పప్పు గుత్తితో అయినా గుజ్జుగా చేసుకోండి. ఒక పాత్రలో మొక్క జొన్నలు వేసి... బంగాళ దుంపల గుజ్జు వేసి... జున్ను, తరిగి ఉంచిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా, తెల్ల మిరియాల పొడి, జాపత్రి, తగినంత ఉప్పు  వేసుకుని కలిపి... కొంచెం కొంచెం చేత్తో తీసుకుంటూ కబాబ్ లా తయారు చేసుకోవాలి... స్టవ్‌ పై పాన్‌ పెట్టి నూనె వేడి అయ్యాక కబాబ్‌లు వేసి చిన్న మంటపై గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. అంతే...

మరింత సమాచారం తెలుసుకోండి: