ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి. రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి దోశ గురించి అందరికీ తెలుసు. రాగులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటి పిండితో తయారు చేసే రాగి దోశ ఎంతో రుచిగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా. ముఖ్యంగా రాగి దోశ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఆ వ్యాధితో బాధపడేవారు రాగి దోశ రోజు ఉదయం తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.  మరి ఆ దోశ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


తయారు చేయు విధానం : ఓ బౌల్ తీసుకుని అందులో రాగిపిండిని వేయండి. ఇప్పుడు అందులో నీరు పోసుకుని దోశపిండిలా వచ్చేలా ఇలా కలుపుకోండి పిండిని.ఇప్పుడు కలుపుకున్న దోశ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. ఇప్పుడు పదార్థాలన్ని బాగా కలిసేలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి.

దోశ పాన్ తీసుకుని మీడియం మంటపై పెట్టి వేడి చేయండి. ఇప్పుడు రాగి పిండిని తీసుకుని దోశలా వేయండి. ఇది మామూలు దోశపిండిలా వేయడానికి కుదరదు. కాబట్టి మీరు దోశ వేసుకునేటప్పుడే దోశ ఆకారంలో పిండిని వేయండి.దోశని నెయ్యితో రెండు వైపులా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చండి. అంతే ఎంతో హెల్దీ అంతే టేస్టీ రాగి దోశ సిద్ధమైనట్లే. ఈ దోశ ఏదైనా చట్నీతో, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: