ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మష్రూంలు ఎంత రుచికరంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. ఇక మష్రూంలతో రుచికరమైన ఆమ్లెట్ తయారు చేసుకొని తింటే ఆ మజానే వేరు. ఇక రుచికరమైన మష్రూం ఆమ్లెట్ లని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

మష్రూం ఆమ్లెట్ తయారుచేయు విధానం......

మష్రూంలు - మీడియం సైజువి మూడు,
కోడి గుడ్లు - మూడు,
ఉల్లితరుగు - రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి తరుగు - ఒక టీస్పూను,
కొత్తి మీర తురుము - అర టీస్పూను,
మిరియాల పొడి - ఒక టీస్పూను,
ఉప్పు - తగినంత,
నూనె - సరిపడినంత

మష్రూం ఆమ్లెట్ తయారు చేయు విధానం....ముందుగా పుట్టగొడుగులను సన్నగా తురుము కోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి... కాస్త నూనె వేసి పుట్టగొడుగుల తురుమును వేయించి దించేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడి గుడ్లను పగుల గొట్టి, అందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కాస్త ఉప్పు, వేయించిన పుట్టగొడుగుల ముక్కులు వేసి బాగా గిలక్కొట్టాలి. అందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి... కాస్త నూనె రాసి ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు వైపులా కాల్చాక స్టవ్ కట్టేయాలి. మష్రూం ఆమ్లెట్ ను పిల్లలకు పెడితే మంచి పోషకాలు అందుతాయి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: