ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. గోభి మసాలా ఎంత రుచికరంగా ఇంకా ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దీన్ని బంగాళదుంపతో చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. ఇక ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

రుచికరమైన బంగాళదుంప గోభి మసాలా తయారు చెయ్యడానికి కావల్సిన పదార్థాలు....

కాలీఫ్లవర్: 1(మీడియం సైజ్, ఉడికించిన మరియు ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంపలు: 4 (ఉడికించి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి),పచ్చిబఠానీ: 1/2 కప్స్ (ఉడికించినవి), ఆయిల్ : 2 టీ స్పూన్, జీలకర్ర : 2 టీ స్పూన్,ఇంగువ పొడి : 1 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ : 3 (సన్నగా తరిగినవి), అల్లం: 1 చిన్న ముక్క (సన్నగా తరిగిపెట్టుకోవాలి), వెల్లుల్లి రెబ్బలు: 6-7(సన్నగా తరిగిపెట్టుకోవాలి), టమోటోలు : 3 (సన్నగా తరిగిపెట్టుకోవాలి),
ఉప్పు: రుచికి సరిపడా, కారం : టీ స్పూన్, ధనియా పౌడర్ : 1 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి: 1 1/2 టీ స్పూన్, డ్రై మ్యాంగో పౌడర్ : 1 టీ స్పూన్, కొత్తిమీర : టీ స్పూన్ (సన్నగా తరిగిపెట్టుకోవాలి),
పసుపు పొడి :1/2 టీ స్పూన్....

రుచికరమైన బంగాళదుంప గోభి మసాలా తయారు చేసే విధానం....

ముందుగా ఒక సాస్ పాన్ తీసుకొని , అందులో జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి మరియు టమోటో ముక్కలు వేయాలి.అలాగే పసుపు మరియు ఉప్పు కూడా వేసి తక్కువ మంట మీద వేగించుకోవాలి.టమోటోలు మెత్తగా ఉడికే వరకూ వేగించి, ఆతర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్న బంగాళదుంప ముక్కలు మరియు కాలీఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేయాలి.తర్వాత వెంటనే పచ్చిబఠానీలకు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి మరియు డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.అలా పది నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.అంతే స్టౌ ఆఫ్ చేసి, చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని రొటీలో తింటే ఇంకా ఎంతో రుచికరంగా ఉంటుంది... ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు గురించి తెలుసుకోవడం కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: