కావాల్సిన పదార్థాలు:
బోన్‌లెస్‌ చికెన్‌ - రెండు కిలోలు
కారం - కిలోన్నర
ఆవపిండి - పది స్పూన్లు
పసుపు - రెండు స్పూన్లు
ఉప్పు- కిలో


జీలకర్ర పొడి - పది స్పూన్లు
మెంతిపిండి - పది స్పూన్లు
ఆమ్‌చూర్‌ పౌడర్‌ - పది స్పూన్లు
నూనె - తగినంత


కరివేపాకు - నాలుగు రెబ్బలు
జీలకర్ర - రెండు స్పూన్లు
ఆవాలు - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - పది
వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో


తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఓ రోజంతా ఎండబెట్టాలి. తర్వాత‌ రోజు ఈ ముక్కల్లో మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి.. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి.


ఈ తాలింపును చికెన్‌ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో పెట్టాలి. పచ్చడి అంతా మునిగే వరకూ నూనె పోసి, మూత పెట్టెయ్యాలి. మూడు, నాలుగు రోజుల పాటు ఊరితే స‌రిపోతుంది. అంటే నోనూరించే చికెన్ ప‌చ్చ‌డి రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: