కావాల్సిన ప‌దార్ధాలు:
కోకో పౌడర్‌ - అరకప్పు
కోడిగుడ్డు - 1
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌
మైదా పిండి - ఒకటిన్నర కప్పు
బేకింగ్‌ పౌడర్‌ - ఒకటిన్నర టీస్పూన్‌


పాలు - పావు కప్పు
యాపిల్‌ సాస్‌ - పావుకప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
మఫిన్‌ కప్పులు - 12


బేకింగ్‌ సోడా - ఒకటిన్నర టీస్పూన్‌
ఉప్పు - రుచికి తగినంత
వెన్న - 3 టేబుల్‌స్పూన్లు
డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌ - ముప్పావు కప్పు


తయారీ విధానం:
ముందుగా ఒకపాత్రలో మైదా పిండి తీసుకొని కోకో పౌడర్‌, సోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. మరొక పాత్రలో క్రీమ్‌, వెన్న, పంచదార తీసుకుని అన్ని పదార్థాలు కలిసేలా కలియబెట్టాలి. కోడిగుడ్డు కొట్టి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. వెనీలా కూడా వేసి కలుపుకోవాలి. రెండు మిశ్రమాలు కలపాలి.


మిశ్రమాలు బాగా కలిసేందుకు పాలు పోయాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్‌ కప్పులలో నింపాలి. ఒవెన్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఒవెన్‌లో నుంచి తీశాక అరగంట పాటు చల్లార్చాలి. తరువాత సర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే ఇంట్లోనే ఎంతో సులువుగా చాకోలెట్ క‌ప్‌కేక్ రెడీ..!  



మరింత సమాచారం తెలుసుకోండి: